శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (11:17 IST)

నేను లైలా.. వారంతా మజ్నూలా.. నా చుట్టూ తిరుగుతున్నారు.. అమిత్ షా

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కీలకమైన ప్రచార పర్వం ముగిసింది. ప్రచారం చివరిరోజైన ఆదివారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన కాషాయదళంలో మరింత  ఉత్తేజాన్ని నింపింది. రాజధానిలో పొలిటికల్‌ హీట్‌ను మరింత పెంచింది.
 
ఇక బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో తాను లైలా పాత్ర పోషిస్తుంటే.. మిగత పక్షాలన్నీ మజ్నూలా తన చుట్టే తిరుగుతున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  
 
పాతబస్తీలో రొహింగ్యాలు, పాకిస్తానీ ఓటర్లు, అక్రమ వలసదారులు ఉన్నారని కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు హ్యాస్యాస్పదమని తెలిపారు. కేవలం పాతబస్తీపైనే ఆ పార్టీ నేతలంతా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. 
 
అక్రమ వలసదారులు ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఏం చేస్తున్నారు. పాత బస్తీలో ఉన్న వారంతా కేంద్ర హోంమంత్రి శాఖ అనుమతితోనే ఉంటున్నారని చెప్పారు. బీహార్‌లో బీజేపీ విజయం వెనుక తన పాత్ర ఉందని అంటున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం అన్ని పార్టీల నేతలంతా తననే టార్గెట్‌గా చేసుకున్నారని వెల్లడించారు.