గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (16:59 IST)

రోజా నాకు సోదరి లాంటిదే.. గబుక్కున ఆ మాట అనేశాను: బండ్ల గణేష్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటి రోజా తనకు సోదరిలాంటిదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటి రోజా తనకు సోదరిలాంటిదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఓ చర్చా కార్యక్రమంలో భాగంగా బ్రోకర్ వి నువ్వు అని రోజా.. నీ పళ్లు రాలిపోతాయి, అంటూ బండ్ల గణేష్ పరస్పరం దూషించుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 
 
ఆ కామెంట్లపై ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ స్పందించారు. ఆ చర్చా కార్యక్రమంలో మన సోదరి ఏదో నోరు జారిందన్నారు. తానేంటో ఆమెకు తెలుసు. ఆ రోజున తాను కూడా నోరుజారడం జరిగిందన్నారు.
 
ఆ తర్వాత తనకు చాలా బాధ అనిపించిందని.. గబుక్కున అంత మాటన్నానే అనిపించింది. ఈ రోజుకి కూడా ఆమె తనకు సోదరి లాంటిదే. ఆ క్షణాన ఆవేశంలో అనుకున్నామేగానీ.. మేమిద్దరం పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని చెప్పుకొచ్చారు. మీ టూ గురించి స్పందించేందుకు మాత్రం బండ్ల గణేష్ దాటవేశారు.