ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (18:13 IST)

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. గురువారం రాత్రి ప్రధాన ఆలయంలో రెండు విగ్రహాలు చోరీకి గురైయ్యాయి. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులు దొంగిలించినట్లు వార్తలు వస్తున్నాయి.  
 
15 కిలోల వెండితో పాటు కొన్ని బంగారు ఆభరణలు చోరీకి గురైనట్లు సమాచారం. వీటి విలువు సుమారు రూ. 9 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ విషయం తెలుసుకుని వెంటనే డాగ్ స్క్వాడ్‌తో సోదాలు ప్రారంభింటారు. ఫింగర్ ప్రింట్స్ సేకరించే పనిలో పడ్డారు. ముసుగు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.