శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (09:47 IST)

దమ్ముంటే మాతో పొత్తుందని చెప్పగలరా?: కేసీఆర్‌కు బీజేపీ సవాల్

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్‌కు దమ్ముంటే టీఆర్ఎస్-బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని ప్రెస్‌మీట్‌ పెట్టి బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎప్పటికీ బీజేపీకి టీఆర్ఎస్‌తో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారని టీఆర్ఎస్ కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు.

అంతేగాకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని అన్నారు. రాముడి కోసం భిక్షమెత్తడానికి బీజేపీ సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.