సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జులై 2023 (19:48 IST)

మాజీ మంత్రి నారాయణపై కేసు పెట్టిన మరదలు కృష్ణప్రియ

krishnapriya
మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత పి.నారాయణపై ఆయన మరదలు కృష్ణప్రియ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆమె హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్‌కు తన ఫిర్యాదును అందజేశారు. తన భర్తతో పాటు బావ నారాయణ తనను వేధిస్తున్నారంటూ అందులో పేర్కొన్నారు. 
 
కాగా, తన భార్యకు మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బోగోలేదని, ఆమె వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోద్దని ఆమె భర్త, నారాయణ సోదరుడు నారాయణ చేసిన సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. కానీ, కృష్ణప్రియ మాత్రం నారాయణతో కట్టుకున్న భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
తన బావ నారాయణ, భర్త సుబ్రహ్మణ్యంలు తనను వేధిస్తున్నారటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ అందులో పేర్కొన్నారు. దీంతో మాజీ మంత్రి నారాయణపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, తాను మానసిక సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తన భర్త చేసిన ఆరోపణలపై కూడా ఆమె చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.