ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (09:45 IST)

కర్నాటకలో భారీ వర్షాలు - తెలంగాణాలో కొత్తిమీర కిలో రూ.400

Coriander
కర్నాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణా రాష్ట్రంలో కేజీ కొత్తిమీర ఏకంగా 400 రూపాయలు పలుకుతోంది. నిన్నమొన్నటివరకు రూ.80 నుంచి రూ.100 పలికిన ఈ ధర ఇపుడు ఏకంగా రూ.400కు చేరింది. కర్నాటకలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణాలోని పలు మార్కెట్లకు కొత్తిమీరతో పాటు ఇతర కాయగూరలు తక్కువ సంఖ్యలో వస్తున్నాయి. దీంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా వీటి ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతున్నాయి. 
 
ముఖ్యంగా ఇటీవలి కాలంలో కొత్తిమీర ఐదు రూపాయలకు 2 లేదా మూడు కట్టలు ఇచ్చేవారు. కానీ ఇపుడు అది ఏకంగా రూ.400కు చేరిపోయింది. నిన్నామొన్నటివరకు రూ.80 నుంచి రూ.100 వరకు పలికిన కొత్తిమీర ధర తెలంగాణాలోని వరంగల్, ఖమ్మం మార్కెట్‌లలో ప్రస్తుతం రూ.400 మేరకు పలుకుతోంది. కర్నాటక నుంచి కొత్తమీర మార్కెట్లకు సరఫరా అవుతుంది. 
 
 
కూరగాయల ధరలు రోజురోజుకు కొండెక్కుతున్న వేళ కొత్తమీర ధర కూడా అందకుండా పోతోంది. ఐదు రూపాయలకు రెండుమూడు కట్టలు లభించే వేళ కిలో కొత్తిమీర ఏకంగా రూ. 400కు చేరుకుంది. నిన్నమొన్నటి వరకు కిలో కొత్తమీర రూ. 80 నుంచి రూ. 100 పలకగా వరంగల్, ఖమ్మం మార్కెట్‌లలో ప్రస్తుతం రూ. 400కు పైనే పలుకుతోంది. కర్ణాటక నుంచి కొత్తిమీర ఈ మార్కెట్లకు సరఫరా అవుతోంది. 
 
అయితే, గత కొన్ని రోజులుగా కర్నాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫలితంగా కాయగూరల దిగుబడి గణనీయంగా తగ్గింపోయింది. ఫలితంగా తెలంగాణా మార్కెట్‌లకు అరకొరగా సరఫరా చేస్తున్నారు. 
 
కొద్దిమొత్తంలో వస్తున్న కొత్తిమీర కోసం వ్యాపారులు పోటీపడుతుండడంతో దాని ధర అమాంతం కొండెక్కింది. నిన్న పలుమార్కెట్లలో కిలో రూ. 400 వరకు పలికింది. మహబూబాబాద్‌ జిల్లాలో రోజుకు 20 క్వింటాళ్ల కొత్తిమీర అవసరం కాగా, ప్రస్తుతం రోజుకు 5 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని, ధరల పెరుగుదలకు ఇదే కారణమని వ్యాపారులు చెబుతున్నారు.