గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (23:28 IST)

శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించాలంటే?

ధనియాలను గ్లాస్ నీటిలో మరిగించి తీసుకుంటే జలుబు, జ్వరం, వేడి తగ్గిపోతుంది. ధనియాలను రోజు వారి ఆహారంగా తీసుకుంటే శరీరంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేస్తుంది. 

 
మధుమేహం రాకుండా అడ్డుకోవడంలో ధనియాలు అద్భుతంగా పనిచేస్తాయి. టైఫాయిడ్‌కు ధనియాలు విరుగుడులా పనిచేస్తుంది. సాల్మోనెల్లా అనే బాక్టీరియాతో ఏర్పడే టైఫాయిడ్‌ను ధనియాలు దూరం చేస్తాయి. 

 
ధనియాలను పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఓబెసిటీని దూరం చేస్తాయి. రెండు చెంచాల ధనియాలను తీసుకుని పౌడర్‌గా చేసి ఒక గ్లాస్ నీటిలో వేసుకుని తాగితే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.