రీసాలగడ్డ వాటర్ ట్యాంకులో మృతదేహం
హైదరాబాదు నగరం, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రీసాలగడ్డలో జలమండలి వాటర్ ట్యాంకులో మృతదేహం లభ్యమైంది. ట్యాంకుపై భాగంలోని గల మూత తొలగించిన సిబ్బందికి మృత దేహం కనిపించిందని చెప్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు శవాన్ని తొలగించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై వాటర్ ట్యాంక్‌లో పడేసి ఉంటారా? లేక ప్రమాదవశాత్తూ ఎవరైనా ట్యాంక్‌లో పడ్డారా? అన్న కోణంలో పోలీసులు విచారణలో చేపట్టారు. అయితే వాటర్ ట్యాంక్ మూత పెట్టి ఉండడం.. గత కొద్ది రోజులుగా ట్యాంకును క్లీన్ చేయకుండా ఉండడంతో హత్యా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
చివరకు వాటర్ ట్యాంకులోనే మనిషి శవం లభ్యం కావడంతో ఆ వాటర్ తాగిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు స్థానిక కార్పోరేటర్ తెలిపారు. ఇప్పటికే పలు అనారోగ్యాలతో సతమతమతవుతున్న ప్రజలు ప్రస్తుత సంఘటనతో షాక్‌లో ఉన్నట్టు చెప్పారు. మృతుడికి 25 సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.