మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 నవంబరు 2022 (11:51 IST)

ఊహించిన మెజార్టీ రాలేదు.. ప్చ్... బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి

rajagopal reddy
మునుగోడు ఉప ఎన్నికల్లో తాము ఊహించిన మెజార్టీ రాలేదని ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో చివరికదాకా హోరాహోరీ తప్పకపోవచ్చన్నారు. ఓట్ల లెక్కింపులో చివరి రౌండ్ ముగిసేంత వరకు విజయం ఎవరిదో చెప్పడం కష్టమన్నారు. 
 
రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యత మారిపోతుందన్నారు. అందువల్ల తుది ఓటు లెక్కించేంతవరకు ఉత్కంఠత తప్పదన్నారు. అయితే, చౌటుప్పల్ మండలంలో తాము ఊహించినదానికంటే బీజేపీ అధిక మెజార్టీ రాలేదని, ఇది తీవ్ర నిరాశకు లోనుచేసిందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
అయినప్పటికీ బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఆయన ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేంత వరకు ఆయన కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. అయితే, ఏ ఒక్క రౌండ్‌లోనూ బీజేపీ తన అధిపత్యాన్ని చాటలేకపోయింది. దీంతో రాజగోపాల్ రెడ్డి కౌంటింగ్ కేంద్రాన్ని వీడి ఇంటికి వెళ్లిపోయారు.