బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 నవంబరు 2022 (11:32 IST)

ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి.. ఓటమిని అంగీకరించారా?

komatireddy rajagopalreddy
రెండు తెలుగు రాష్ట్రాల్లో అమిత ఉత్కంఠతను రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రౌండ్ రౌండ్‌కు సరళి మారిపోతుంది. ఇప్పటివరకు వెల్లడైన నాలుగు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, అధికార తెరాస నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కంటే వెనుకబడివున్నారు. దీంతో ఆయన ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగాల్సివుండగా, ఇప్పటివరకు నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తికాగానే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. రెండో రౌండ్ పూర్తికాగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి పాల్వాయి స్రవంతి ఇంటికి వెళ్లిపోయారు. ఇపుడు బీజేపీ అభ్యర్థి కూడా వెళ్లిపోవడంతో వీరిద్దరూ ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే తమ ఓటమిని అంగీకరించినట్టు ఉన్నారనే ప్రచారం సాగుతోంది.