గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (22:03 IST)

పంది కొవ్వుతో కల్తీ నూనె.. ఫాస్ట్ ఫుడ్ దుకాణాలకు విక్రయం

Oils
పంది కొవ్వుతో తయారు చేసిన కల్తీ నూనె బాగోతం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని నేరేడ్ మెట్‌లో జరిగింది. హైదరాబాద్ నేరేడ్‌ మెట్‌ పరిధిలోని ఆర్కేపురంలో రమేష్ శివ (24) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 
 
కొన్నేళ్లుగా తన నివాసంలో గుట్టుచప్పుడు కాకుండా పంది కొవ్వుతో వంట నూనెను తయారు చేస్తున్నాడు. ఇలా తయారు చేసిన నూనెను రోడ్డు పక్కన ఫ్రైడ్‌ రైస్‌ దుకాణాలు నిర్వహించే వారికి తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. 
 
దీనికి గురించి మాల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులకు పక్క సమాచారం అందింది. పోలీసుల రైడ్‌లో గుట్టుగా పంది కొవ్వుతో నూనె తయారు చేస్తున్న నిందితుడి బండారం మొత్తం బట్టబయలైంది. 
 
పంది కొవ్వు నూనెను కొనుగోలు చేస్తున్న ఫాస్ట్‌ ఫుడ్‌ దుకాణదారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.