శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 27 జూన్ 2023 (21:19 IST)

గోధుమ పిండితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

గోధుమ పిండి. ఈ పిండితో పూరీలు, చపాతీలు ఇంకా రుచికరంగా ఆయా పదార్థాలు చేసుకుని తింటాము. ఐతే ఇదే గోధుమ పిండి అందాన్ని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. గోధుమ పిండితో ఫేస్ ప్యాక్‌ వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. అదెలాగో తెలుసుకుందాము. గోధుమ పిండిలో పచ్చి పాలు, తేనె, రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. డార్క్ స్పాట్స్ కోసం గోధుమ పిండిలో మీగడ కలిపి ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవాలి.
 
గోధుమపిండిలో నారింజ తొక్కల పొడిని కలుపుకుని వాడుకుంటే టానింగ్ సమస్య తగ్గుతుంది. మచ్చలేని చర్మం కోసం గోధుమ పిండిని సాధారణ నీటిలో కలిపి ఉపయోగించవచ్చు. శుభ్రమైన చర్మం కోసం, పిండిలో పెరుగు, తేనె కలిపి ఉపయోగించవచ్చు. డల్ స్కిన్ కలవారు పచ్చి పాలలో గోధుమ రవ్వను కలిపి అప్లై చేయవచ్చు. జిడ్డు- మొటిమలు ఉన్న చర్మానికి పిండి ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

గమనిక: చర్మాన్ని బట్టి బ్యూటీషియన్ సలహా తీసుకున్న తర్వాత చిట్కాలు ప్రయత్నించాలి.