శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

మందు బాబుల నుంచి రూ.1.99 కోట్లు స్వాధీనం

తెలంగాణ రాష్ట్రంలో మందుబాబుల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. మందుబాబులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫలితంగా భారీగా అపరాధం విధిస్తున్నారు. మద్యం తాగి వాహ‌నాలు న‌డ‌పకూడ‌ద‌ని పోలీసులు ఎంత‌గా ప్రచారం చేస్తున్న‌ప్పటికీ మందుబాబులు వినిపించుకోవ‌ట్లేదు. 
 
గ‌త నెల‌లో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు భారీగా డ్రంకెన్ డ్రైవ్ కేసుల‌ను న‌మోదు చేశారు. అదేస‌మ‌యంలో భారీగా జ‌రిమానాల‌ను వ‌సూలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1,917 మందిపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వివ‌రించారు.
 
వారిలో కోర్టు 58 మందికి రెండు రోజుల‌ నుంచి తొమ్మిది రోజుల వరకు జైలు శిక్ష విధించింది. మిగతా 1,859 మంది నుంచి రూ.1,99,56,300 జరిమానాను వసూలు చేశారు. 
 
మోతాదుకి మించి మద్యం తాగ‌డం, ప‌దే ప‌దే నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ ముగ్గురికి తొమ్మి రోజుల జైలు శిక్ష ప‌డింది. ప‌ది మందికి ఏడు రోజులు, 25 మందికి ఐదు రోజులు, 20 మందికి రెండు రోజుల జైలు శిక్షను విధించారు.