శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (15:11 IST)

తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కొత్త కోర్టులు

telangana state
తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కొత్త కోర్టులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కొత్తగా 57 కోర్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
మొత్తం 57 కోర్టులను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కేడర్లలో ఈ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యతో పాటు కొత్త కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న కోర్టులపై కూడా పనిభారం పెరిగింది. 
 
ఈ విషయాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కొత్త కోర్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా కొత్తగా 57 కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
 
చిన్నారులపై నేరాల విచారణకు ప్రత్యేకంగా 10 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నల్గొండ, ఎల్బీనగర్, వరంగల్ ప్రాంతాలు ఉన్నాయి.