మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (07:40 IST)

పేద బ్రాహ్మణులకు ఉచిత అంబులెన్స్‌ సేవలు

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని పేద బ్రాహ్మణులకు ఉచిత అంబులెన్స్‌ సేవలను ప్రారంభించినట్లు భారత బ్రాహ్మణ సంస్థాన్‌, బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గిరిప్రసాద్‌శర్మ, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీపతి దుర్గారాణి ఒక ప్రకటనలో తెలిపారు.

తెలుపు రేషన్‌ కార్డు కలిగిన పేద బ్రాహ్మణులు వాట్సప్‌ నంబరు: 9701609689 ద్వారా సంప్రదించాలి. పేద బ్రాహ్మణుల కోసం ఎన్నో సంస్థలు వివిధ రకాల సేవలు చేస్తున్నప్పటికీ ఈ తరహా సాయం ఈ సంస్థ చేపట్టడం విశేషం,