బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (22:29 IST)

కేసీఆర్‌.. ఒక చేత‌కాని ముఖ్య‌మంత్రి: భ‌ట్టి విక్ర‌మార్క

ప్ర‌త్యేక రాష్ట్రంలో సాగునీటి రంగం పూర్తిగా అధోగ‌తి పాలైంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్య‌క్షుడు పువ్వాళ్ల దుర్గా ప్ర‌సాద్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వ‌ర రావు, ఖ‌మ్మం న‌గ‌ర కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు మ‌హ‌మ్మ‌ద్ జావేద్‌,ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కుల‌తో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వ్య‌వ‌సాయం పూర్తిగా నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌ల్వ‌కుర్తి లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు ముంపు, న‌ష్టం వంటి అంశాల‌పై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన క‌మిటీ అధ్య‌క్షుడి హోదాలో ఆయ‌న స‌భ్యుల‌తో ఈ రోజు జూమ్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు.

అనంత‌రం ఆయ‌న మీడియా మాట్లాడారు. క‌ల్వ‌కుర్తి లిఫ్ట్ ప్రాజెక్టును ఎవ‌రూ సందర్శించ‌కుండా పెద్ద ఎత్తున పోలీసు బ‌ల‌గాల‌తో ప్ర‌భుత్వం అడ్డుకుంటోంద‌ని భ‌ట్టి అన్నారు. క‌ల్వ‌కుర్తి లిప్ట్ ఏమైనా నిషేధిత ప్రాంత‌మా అని భ‌ట్టి ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించారు. ఇతం ర‌హ‌స్యంగా దాచాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వానికి ఏమోచ్చింద‌ని భ‌ట్టి అన్నారు.

క‌ల్వ‌కుర్తి లిఫ్ట్ ప్రాజెక్టు జాతి ఆస్థి అన్న ఆయ‌న‌.. మొత్తం న‌ష్టాన్ని అంచ‌నావేసేందుకు ఒక ప్ర‌త్యేక సాంకేతిక క‌మిటీని నియమిస్తున్న‌ట్లు చెప్పారు. అంతేకాక సీఎల్పీ సార‌థ్యంలోనూ ఈ క‌మ‌టీ మొత్తం ప్రాజెక్టును ప‌రిశీలించేందుకు ఈనెల 18న క‌ల్వ‌కుర్తి వెళుతున్న‌ట్లు భ‌ట్టి చెప్పారు. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వానికి సీఎల్పీ నేత‌గా ఒక లేఖ రాయ‌బోతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. 
 
వ్య‌వ‌సాయం నిర్ల‌క్ష్యం
రైతాంగ స‌మ‌స్య‌లు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువ‌చ్చేందుకే ఈ నెల 11న ఖ‌మ్మం జిల్లాలో భారీ ట్రాక్ట‌ర్ల ర్యాలీ చేప‌ట్టామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క మీడియా ముందు ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక‌.. వ్య‌వ‌సాయం పూర్తిగా నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో కురిసిన ఆకాల వ‌ర్షాల‌కు జిల్లాలో వ‌రి, మిర్చి, ప‌త్తి పంట‌లు పూర్తిగా దెబ్బ‌తిన్నాయ‌ని భ‌ట్టి చెప్పారు.

ఆయా పంట‌లు పండించిన రైతుల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా విప‌ల‌మైంద‌ని అన్నారు. పంట న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కూ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోపోవ‌డం అత్యంత దారుణ‌ని అన్నారు. ప్ర‌జ‌ల ఇబ్బందులను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌ని అన్నారు.

మేము చెప్పిన పంట‌లే వేయాల‌ని ప్ర‌భుత్వం నిర్భంధ వ్య‌వ‌సాయాన్ని అమ‌లు చేసి.. చివర‌కు స‌న్న‌వ‌డ్లు పండించిన రైతుల‌ను న‌ట్టేట ముంచార‌ని భ‌ట్టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌న్న వ‌డ్ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర రూ.2500 ఇవ్వాల‌ని భ‌ట్టి డిమాండ్ చేశారు. ఆకాల వ‌ర్షానికి ప‌త్తి పంట మొత్తం నాశ‌నం అయింద‌ని.. వారిని కూడా ఆదుకోవాల‌ని అన్నారు. ఖ‌మ్మం జిల్లాలోని ప‌లు మండ‌లాల్లో మొక్క‌జొన్న పంట వేసుకునే గ్రామాల్లో.. ఆ పంట వేయ‌వ‌ద్ద‌ని వ్య‌వ‌సాయ అధికారులు ప్ర‌క‌టించ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

కేంద్రం ప్ర‌క‌టించిన మ‌ద్ద‌తు ధ‌ర‌ను అన్ని రాష్ట్రాలు అమ‌లు చేస్తాయి.. కానీ స‌ర్ ప్ల‌స్ బ‌డ్జెట్ తో ఏర్ప‌డ్డ తెలంగాణలో మాత్రం మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. ప‌రిపాల‌న‌లో కేసీఆర్ అంత అధ‌ముడు దేశంలో ఎవ‌రూ ఉండ‌ర‌ని నిప్పులు చెరిగారు భ‌ట్టి విక్ర‌మార్క. సంప‌న్న రాష్ట్రాన్ని కేసీఆర్ అధోగ‌తి పాలు చేశార‌ని అన్నారు. అయ్య‌, కొడుకు, అల్లుడు పాల‌న‌లో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ప‌త‌న‌మైంద‌ని అన్నారు. 
 
సంప‌న్న రాష్ట్రం సొంత పాల‌న‌లో మ‌రింత శ‌క్తివంతం అవుతుంద‌ని ఆశిస్తే.. పండించిన పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వ‌లేని స్థితిలో ప్ర‌భుత్వం ఉంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క మండిప‌డ్డారు. ఇది కేసీఆర్ చేత‌గానిత‌నానికి నిద‌ర్శ‌మ‌ని అన్నారు. మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం పూర్తిగా వైఫ‌ల్యం చెందింద‌ని భ‌ట్టి చెప్పారు.

అలాగే క‌రోనా, నియామ‌కాల్లో, డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల విష‌యంలో, వైద్యం, రుణ‌మాఫీ, వ‌డ్డీలేని రుణాలు ఇచ్చే ద‌గ్గ‌ర‌.. ఇలా అన్నింటా కేసీఆర్ ప్ర‌భుత్వం విప‌ల‌మైంద‌ని అన్నారు.