ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నిక
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ ఎన్నిక ఫిబ్రవరి 11న జరగనుంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్ల మొదటి సమావేశం ప్రారంభమవుతుంది.
ముందు గా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. మధ్యా హ్నం 12:30 గంటలకు తొలుత మేయర్ ఎన్నిక, అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఏ కారణంగానైనా ఎన్నిక నిలిచిపోతే.. మరుసటి రోజు సమావేశం నిర్వహించి ఎన్నుకుంటారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే జిల్లా కలెక్టర్లలో ఒకరు ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) కమిషనర్ సి.పార్థసారథి శుక్రవారం నోటిపికేషన్ జారీ చేశారు.
మొదటి సమావేశం, మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికల షెడ్యూల్‌పై ఫిబ్రవరి 6లోగా నూతన కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.