ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (22:20 IST)

తెలంగాణలో భారీ వర్షాలు.. సెప్టెంబర్ 1 నుంచి ఎల్లో అలెర్ట్

rain
తెలంగాణ భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. తెలంగాణాలో 2023 సెప్టెంబర్ 1 నుండి 3 వరకు ఉరుములు, మెరుపులు వర్షాలు పడే అవకాశం వుందని ఐఎండీ తెలిపింది.
 
అంతేగాకుండా వాతావరణ శాఖ శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. హైదరాబాద్‌లో శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణ వాసులు త్వరలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందనున్నారు.