1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (09:44 IST)

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు.. ప్రజలకు అలెర్ట్

Summer
తెలంగాణ హైదరాబాదులో 40డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం వుందని ఐఎండీ వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ప్రజలు అప్రమత్తంగా వుండాలని పిలుపు నిచ్చారు.
 
రాబోయే నాలుగు రోజుల పాటు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 36-40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. అయితే, సాయంత్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
అందుచేత అవసరం అయితేనే బయటకు రండి అంటూ ఐఎండీ హెచ్చరించింది. ఐఎండీ సూచనల ప్రకారం రాబోవు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్‌ అంబేద్కర్ తెలిపారు. 
 
ఈ సమయంలో.. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని.. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి వోఆర్‌ఎస్‌ , ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని సూచించారు. ఇక, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.