1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (15:00 IST)

నుమాయిష్ కోసం ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు

గత యేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నుమాయిష్‌ను నిర్వహించలేదు. కానీ, ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో దీన్ని నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే జనవరిలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో నుమాయిష్ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసింది. ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఎగ్జిబిష‌న్ సొసైటీ కార్య‌ద‌ర్శి బీ ప్ర‌భాశంక‌ర్ పేర్కొన్నారు.
 
ఇక జీహెచ్ఎంసీ, పోలీసు, ఫైర్ స‌ర్వీసెస్, విద్యుత్, రోడ్ల భ‌వ‌నాల శాఖ‌ల నుంచి కూడా అనుమ‌తి పొందాల్సి ఉంది. ప్ర‌తి ఏడాది దాదాపు 2,500 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ ఏడాది త‌క్కువ సంఖ్య‌లో స్టాళ్ల‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది.