శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (09:27 IST)

హైదరాబాద్‌ - శ్రీనగర్‌ విమాన సర్వీసులు ప్రారంభం

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా శ్రీనగర్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.  జీహెచ్‌ఐఏఎల్‌ - ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు ప్రయాణికులకు స్వాగతం పలికిన అనంతరం ఉదయం 6.15 గంటలకు 88 మందితో మొదటి విమాన సర్వీసు శ్రీనగర్‌కు బయలుదేరింది.

ఈ సందర్భంగా విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ - శ్రీనగర్‌ విమాన సర్వీసులు ప్రతి వారంలో సోమ, బుధ, శుక్ర, శనివారం రాకపోకలు సాగిస్తాయన్నారు.