సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (10:01 IST)

ప్రేమ పెళ్లికి వద్దన్నారనీ ముస్లిం ప్రియుడి ఆత్మహత్య.. హిందూ ప్రియురాలు కూడా..

suicide
తన ప్రియుడు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన పంజాబ్‌కు చెందిన నేహ (19) 8 నెలలుగా గోపనపల్లి జర్నలిస్టు కాలనీలోని హాస్టల్‌లో ఉంటుంది. నానక్ రామ్ గూడలో ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ అపార్టుమెంటులోని ఓ బేకరీ షాపులో సేల్స్ గర్ల్‌గా పని చేస్తుంది.
 
అయితే, బాలాపూర్ పరిధిలోని వెంకటాపురానికి చెందిన సల్మాన్ అనే యువకుడు ఆరు నెలల క్రితం ఇదే బేకరీలో పనికి చేరాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమంగా మారింది. వీరిద్దరి మధ్య కొనసాగుతున్న ప్రేమ వ్యవహారం తెలియడంతో బేకరీ నిర్వాహకులు సల్మాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. 
 
మరోవైపు, తమ ప్రేమ వ్యవహారాన్ని సల్మాన్ తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి నేహను పెళ్లాడతానని చెప్పాడు. అందుకు వారు నిరాకరించారు. మనస్తాపానికి గురైన సల్మాన్ ఈ నెల ఒకటో తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం నేహాకు రెండు రోజుల తర్వాత తలిసింది. దీంతో ఆమె మంగళవారం తన గదిలో ఫ్యానుకు ఉరేసుని ప్రాణాలు తీసుకుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.