మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మురళి
Last Updated : ఆదివారం, 1 అక్టోబరు 2023 (16:10 IST)

అల్లు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు అయాన్..

allu ayaan
కీర్తి శేషులు పద్మశ్రీ డా.అల్లు రామలింగయ్య. అక్టోబరు ఒకటో తేదీ ఆయన 101వ జయంతి. ఈ సందర్భంగా జూబిలీ హిల్స్‌లోని అల్లు బిజినెస్ పార్క్‌లో అల్లు రామలింగయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా అల్లు అయాన్ మాట్లాడుతూ "శ్రీ అల్లు రామలింగయ్య తాతగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజున ఆయన మనతో లేకపోయినా.. ఆయన మంచి పనులు ఎప్పుడు మనతో ఉన్నాయి. తాత గారి దీవెనలు మాపై ఎప్పుడూ ఉంటాయి' అని అన్నాడు. 
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అల్లు రామలింగయ్య గారితో ఉన్న మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. వెయ్యి సినిమాలకు పైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటులు అల్లు రామలింగయ్య. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో మూడు తరాల సినీ ప్రేక్షకులను ఆయన అలరించారు. తనదైన నటనతో యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ ప్రజానీకాన్ని అలరించిన అల్లు రామలింగయ్య తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం కల్పించుకున్నారు.