బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 7 డిశెంబరు 2020 (20:15 IST)

తెలంగాణ పీసీసి రేసులో నేనున్నా, నాకిస్తే సీట్లు ఓట్లు ఎలా రావో చూస్తా: జగ్గారెడ్డి

దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమలం గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు విజయశాంతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు హస్తం పార్టీని వదిలేసి కమలం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఈ నేపధ్యంలో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనకు పీసీసి చీఫ్ పదవి ఇస్తే తెలంగాణలో ఓట్లు, సీట్లు ఎలా రావో చూస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎలాంటి బూస్ట్ కావాలో అది తన దగ్గర వుందన్నారు. పార్టీకి పునర్ వైభవం తెచ్చే మందు తన వద్ద వుందని చెప్పుకొచ్చారు.
 
వాస్తవానికి తను గత ఏడాదిన్నరగా పీసీసి చీఫ్ పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారనీ, ఐతే అధిష్టానం ఆ పగ్గాలను తనకు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో బలం వచ్చేట్లు చేస్తానని అన్నారు.