మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2020 (10:13 IST)

జనసేన గ్రేటర్ హైదరాబాద్ కమిటీలకు ఆమోదం

జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 50  డివిజన్లకు పార్టీ కమిటీలను నియమించింది. ఈ కమిటీలను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర వేశారు.

జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆధ్వరంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. గత కొన్ని వారాలుగా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.

కమిటీలు ఎంపిక.. కార్యకర్తల అభీష్టం ప్రకారమే జరగాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ ఎంపికలు జరిపినట్లు పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్.శంకర్ గౌడ్, బి.మహేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరి, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు  ఆర్. రాజలింగం తెలిపారు.