1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (11:53 IST)

బోయగూడ అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి - మృతులకు రూ.3 లక్షలు

సికింద్రాబాద్‌లోని బోయగూడలోని ఓ టింబర్, స్క్రాప్ డిపోలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే వారి మృతదేహాలను బీహార్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆయన ఆదేశించారు. 
 
కాగా, ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ప్రమాద సమయంలో అందులో 15 మంది నిద్రిస్తుండగా, ఇద్దరు మాత్రమే బయటపడ్డారు. మిగిలిన వారిలో 11 మంది సజీవదహనం కాగా, మరో ఇద్దరు ఆచూకీ తెలియాల్సివుంది. ఈ ప్రమాదంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి.