బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (18:23 IST)

పోలీసుల తీరుపై కోమటిరెడ్డి ఆగ్రహం

తెలంగాణలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో సెక్రెటేరియట్ కార్యక్రమనికి వెళ్లకుండా పోలీసులు గృహానిర్బంధం చేయటంపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

హైదరాబాద్ కమిషనర్ అంజన్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవటం ఏంటి అని  ప్రశ్నించారు.

ఎలాంటి వారెంట్ లేకుండా గృహానిర్బంధం చేయటం రాజ్యాంగ హక్కులను ఆపహేళన చేసినట్టే అని అన్నారు. పార్లమెంట్ సభ్యులు అని కూడా చూడకుండా అవమానించాటాన్నీ కోమటిరెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసుల వ్యవహారం పై కోర్టుకు వెళతామని  తెలిపారు.