శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (12:52 IST)

జీవితం ఓ కిక్ బాక్సింగ్.. గెలవాలంటే దెబ్బలు తగలాలి : కేటీఆర్

జీవితంలో గెలవాలంటే ఎదురు తెబ్బలు తగలాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. యువత ముందున్న చాలెంజ్ అదేనన్నారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడటమే జీవితమన్నారు.

జీవితంలో గెలవాలంటే ఎదురు తెబ్బలు తగలాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. యువత ముందున్న చాలెంజ్ అదేనన్నారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడటమే జీవితమన్నారు. జీవితం ఓ కిక్ బాక్సింగ్ లాంటిదని తెలిపారు. ఎన్ని ఎదురుదెబ్బలకు దృఢంగా నిలబడతామో అప్పుడే జీవితంలో గెలిచినట్టన్నారు. 
 
వరంగల్ పట్టణంలో తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ రీజనల్ సెంటర్‌ (టీఏఎస్‌కే- టాస్క్)ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ... విద్యార్థులను అన్ని పరీక్షలకు సిద్ధం చేయడమే టాస్క్ లక్ష్యమన్నారు. బెంగళూరు తరహాలో వరంగల్ ఐటీని అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ పిల్లలకు వరంగల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించే రీతిలో విద్యార్థులను తయారుచేస్తామన్నారు. 
 
ఒక ధోనీలా, శ్రీకాంత్‌లా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసినా మరిన్ని నిధులు సమకూరుస్తామన్నారు. టాస్క్‌తో 4 కంపెనీలు ఎంఓయులు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల్లో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచార్య శ్రీకాంత్ కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందం కూడా ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు బాగున్నాయని ప్రశంసించారు.