గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (14:23 IST)

మద్యానికి బానిసైన భర్త... భార్య మనస్థాపం.. ఆత్మహత్య..

కర్నూలు పట్టణంలో బంగారుపేటకు చెందిన భువనేశ్వరి ఆరేళ్ల క్రితం రవీంద్రనాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానిక వెంకట రమణ కాలనీలోని రోడ్-1లో నివాసముంటుండగా రవీంద్రనాథ్ ఓ ప్రైవేటు బీమా సంస్థలో పనిచేస్తున్నాడు.
 
భర్త మద్యానికి అలవాటు పడ్డాడు. రోజూ తాగి రావడంతో భార్యా, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 
భర్తకు ఎన్నిసార్లు చెప్పినా తీరులో మార్పు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారు.

సోమవారం కూడా భర్త తాగి వచ్చేసరికి భరించలేక అర్థరాత్రి పంచెతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న కర్నూలు టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. 
 
మృతురాలి తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు భర్తను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.