ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (10:54 IST)

తెలంగాణలో ఈరోజు అర్ధరాత్రి నుండి మద్యం దుకాణాలు బంద్

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి ఆదివారం అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగియనున్నది గత 15 రోజులుగా ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల స్థానంలోని 34 నియోజకవర్గాల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
 
రేపటి నుండి నాలుగు రోజుల పాటు బ్యాంకు సేవలు బంద్ కానున్నాయి. ఈనెల13న రెండవ శనివారం 14వ తేదీన ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు దినాలు కాగా, బ్యాంకులను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 15,16 తేదీల్లో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పిలుపుమేరకు మధిరలో బ్యాంకు సిబ్బంది బంద్ పాటిస్తున్నట్లు సమాచారం.