మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మే 2023 (19:21 IST)

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. భార్యను చంపి భర్త ఆత్మహత్య.. పిల్లలు?

crime news
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆతని పిల్లలు మాత్రం అక్కడి నుంచి పారిపోయారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ తారాస్థాయికి చేరుకుంది. 
 
దీంతో  నాగరాజు.. భార్య గొంతుకోసి హతమార్చాడు. తల్లిని చంపుతుండగా అడ్డొచ్చిన పెద్ద కుమారుడు దీక్షిత్‌నూ హత్య చేసేందుకు నాగరాజు ప్రయత్నించాడు. దీంతో బాలుడు దీక్షిత్‌ తన తమ్ముడిని తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. 
 
భార్యను హత్య చేసిన అనంతరం నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.