బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (15:05 IST)

తెలంగాణ సచివాలయంలోకి మీడియా ఎంట్రీ నిషేధం

తెలంగాణ ప్రభుత్వం మీడియాపై ఉక్కపాదం మోపుతోంది. తెలంగాణ సచివాలయంలోకి మీడియా ఎంట్రీని నిషేధించారు. దీంతో సీఎస్‌ ఎస్కే జోషిని కలిసి జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు.

మీడియాపై నిషేధం ప్రభుత్వ నిర్ణయమని, ఆపడానికి తానెవరిని, తాను ప్రభుత్వ సర్వెంట్‌ను మాత్రమేనని సీఎస్, జర్నలిస్టులకు బదులిచ్చారు. మూడు నెలల్లో రిటైర్‌ అయ్యేవాడినని, మీడియాను అనుమతించొద్దని ప్రభుత్వం చెప్పిందని చెప్పారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ వాళ్లు ఓ స్టైల్‌లో నిరసనలు చేస్తున్నారని, మీ స్టైల్‌లో మీరు నిరసనలు చేసుకోండని జర్నలిస్టులకు జోషి చెప్పారు.