బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (08:30 IST)

ఈ-సిగరెట్లపై నిషేధం

ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ-సిగరెట్ల దిగుమతి, ఎగుమతి, విక్రయాలు, ప్రచారం వంటి అంశాలపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. యువతపై ఈ సిగరెట్ల ప్రభావం అధికంగా ఉందని.. అవి వారిపై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని తెలిపారు.

అమెరికా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు నిర్మలా సీతారామన్‌. పొగాకు బారిన పడి అనారోగ్యాలకు గురవుతున్నవారి సంఖ్యను తగ్గించాలనేది ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించగా.. కేబినెట్‌ ఆమోదించింది. పొగ తాగే అలవాటు తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా యువత ఈ-సిగరెట‍్లను ఆశ్రయిస్తున్నారు. భారతీయ యువతలో ఇదొక వ్యసనంగా మారకుండా జాగ్రత్తలు తీసుకొనేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.