శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 మే 2021 (09:48 IST)

విషాదాంతమైన వలస కూలీల ప్రయాణం.. సీలేరు నదిలో...

సొంతూళ్ళకు వెళ్లాలన్న వలస కూలీల ప్రయాణం విషాదాంతమైంది. లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా లేకపోవడంతో వారంతా నాటు పడవలను ఎంచుకున్నారు. ఈ పడవలు నీటిలో మునిగిపోవడంతో ఈ విషాదం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణలో లాక్డౌన్ నేపథ్యంలో సొంత రాష్ట్రమైన ఒడిశా వెళ్లిపోవాలని భావించిన 11 మంది వలస కూలీలు ప్రయాణమయ్యారు. దీంతో గత అర్థరాత్రి విశాఖ జిల్లా సీలేరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రెండు నాటు పడవల్లో బయలుదేరారు. 
 
ఈ క్రమంలో వారి పడవలు ఒక్కసారిగా నీట మునిగాయి. మొత్తం 11 మంది నదిలో మునిగిపోయారు. వారిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. తర్వాత కాసేపటికి చిన్నారి మృతదేహం లభ్యం కాగా, గల్లంతైన మిగతా ఏడుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.