1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (11:03 IST)

సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్న జగ్గారెడ్డి

సర్వోదయ సంకల్ప పాదయాత్ర మెదక్ జిల్లాలోని మాసాయి పేట నుంచి చేగుంట వరకు సాగింది. ఈ సర్వోదయ సంకల్ప పాదయాత్రలో మీనాక్షి నటరాజన్‌తో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఉదయం మాసాయిపేటలో జరిగిన ప్రార్ధనలో పాల్గొని, అనంతరం మాసాయిపేట నుండి చేగుంట వరకు పాదయాత్ర చేశారు.
 
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. భూదానోద్యమం జరిగి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మాజీ ఎంపీ ఏఐసీసీ, పంచాయితీ రాజ్ సంఘం చైర్ పర్సన్ మీనాక్షి నటరాజన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందన్నారు.  వేలాదిమంది మంది నిరుపేదలకు ఉపయోగపడ్డ భూదానోద్యమాన్ని గుర్తు చేస్తూ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు.
 
గాంధీజీ, నెహ్రూల కాలంలో జరిగిన ఉద్యమాలు నేటి యువత తెలుసుకోవడం లేదని ఆయన అన్నారు. ఆ రోజు గాంధీజీ పిలుపు మేరకు వేల ఎకరాలు భూములను స్వచ్ఛందంగా దానం చేసి, భూములు లేని నిరుపేదలకు పంచారు. ఆ భూదానోద్యమానికి మన రాష్ట్రం నుండే ప్రారంభం కావడం మనకు గర్వ కారణమని ఆయన వ్యాఖ్యానించారు