ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2022 (11:01 IST)

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలుగువారంతా శుభకృత్‌ నామ సంవత్సరం జరుపుకొంటుంటే, తెలంగాణ యువత మాత్రం ఉద్యోగ నామ సంవత్సరం జరుపుకొంటున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 
 
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కవిత శుక్రవారం ప్రత్యేక సందేశంలో శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్‌ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు చేకూరాలని కవిత ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నదన్నారు. 
 
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో యావత్‌ దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలుస్తున్నదని చెప్పారు. శుభకృత్‌ నామ సంవత్సరంలో మరింత ప్రగతిని సాధించాలని, అన్నివర్గాల ప్రజలు సుఖఃసంతోషాలు, ఆనందోత్సాహాలతో ఉండాలని ఆకాంక్షించారు.