సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మే 2022 (19:58 IST)

MMTS నుంచి గుడ్‌న్యూస్- 50 శాతం తగ్గిన ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధరలు

MMTS
MMTS
ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్) ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రో, డీజిల్ ధరలు పెరుగుతున్న వేళ వరుసగా రవాణా చార్జీలు పెరుగుతున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా  ఎంఎంటీఎస్‌ మాత్రం టికెట్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
 
ఇందులో భాగంగా ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ జర్నీ టిక్కెట్ ధరలు తగ్గిపోనున్నాయి. ఫస్ట్‌ క్లాస్‌ జర్నీ టికెట్ ధర 50 శాతం తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు ఈనెల 5వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. 
 
సికింద్రాబాద్ - ఫలక్ నుమా- లింగంపల్లి మధ్య నడిచే రైళ్లల్లో ప్రయాణికులకు ఈ టిక్కెట్ ధరల తగ్గింపుతో ప్రయోజనం చేకూరనుంది.