సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మే 2022 (11:29 IST)

26న హైదరాబాద్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

modi
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) వార్షికోత్స‌వంలో మోదీ పాల్గొననున్నారు. 
 
అంతేకాకుండా రామ‌గుండంలో ఏర్పాటు చేసిన ఎరువుల క‌ర్మాగారాన్ని కూడా ఆయ‌న హైద‌రాబాద్ నుంచే వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
20 రోజులు వ్యవధిలో బీజేపీ ప్రముఖులు, అగ్రనేతలు తెలంగాణకు రావడంతో రాష్ట్ర కేడర్‌లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. ప్రధాని రాక నేపథ్యంలో మోదీకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఘనంగా స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు. 
 
రీసెంట్‌గా బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ అనంతరం బండి సంజయ్‌కు మోడీ ఫోన్‌ చేసి ప్రశంసించిన సంగతి తెలిసిందే.