గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (18:02 IST)

హైదరాబాద్​లో ముస్లిం సంఘాల భారీ ర్యాలీ

ఎన్‌ఆర్​సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

హైదరాబాద్​లో ఎన్‌ఆర్​సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. మీరాలం ఈద్గాలో ప్రార్థనల అనంతరం ర్యాలీగా బయల్దేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముస్లిం సంఘాలు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నాయి.

మీరాలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు ర్యాలీ సాగింది. ఎన్‌ఆర్‌సీ, సీఏఏకి వ్యతిరేకంగా ముస్లింల నినాదాలు చేశారు. ర్యాలీ దృష్ట్యా పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.