బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (18:49 IST)

హుస్సేన్‌సాగర్‌ చుట్టూ త్వరలోనే నైట్‌ బజార్‌...

Hussain Sagar
హైదరాబాద్ నగరం షాపింగ్‌కు ఎంతో ఫేమస్. చార్మినార్, చుడీ బజార్, కోఠి, బడీచౌడీ, సుల్తాన్ బజార్‌లో షాపింగ్ చేయడానికి యువతులు తెగ ఇష్టపడుతుంటారు. చార్మినార్ వద్ద రాత్రి అయితే చాలు రంగు రంగుల గాజులు దర్శనమిస్తుంటాయి. అలాగే సుల్తాన్ బజార్‌లో సూడసక్కని బట్టలు కొనేందుకు తెగ ఆసక్తి చూపుతుంటారు. అలా ఆ ప్రాంతాలు షాపింగ్‌కు ఫేమస్. అలాంటి అందం ఇప్పుడు హుస్సేన్ సాగర్‌ను పలుకరించబోతోంది.
 
సండే రోజు చిన్నా పెద్దలకు అంతులేని వినోదాన్ని అందిస్తూ ఆహ్లాదానికి చిరునామాగా నిలిచిన హుస్సేన్‌సాగర్‌ చుట్టూ త్వరలోనే నైట్‌ బజార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ శుక్రవారం శాసనమండలిలో ప్రకటించారు. అయితే ఇందుకు అనుగుణంగా ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఏర్పాట్లను చేస్తుంది. 
 
సుమారు 1300 మీటర్ల విస్తీర్ణంలో రూ.18 కోట్ల అంచనా వ్యయంతో నైట్‌ బజార్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. చార్మినార్‌ చుడీ బజార్‌, కోఠీ బడీ చౌడీ, సుల్తాన్‌బజార్‌ తరహాలో అత్యాధునిక హంగులతో 150 నుంచి 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే వస్తువులను విక్రయించనున్నారు.