గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 19 అక్టోబరు 2020 (16:17 IST)

వర్ట్యువల్‌ రియాల్టీ (వీఆర్‌) విధానంలో నిట్‌ యూనివర్శిటీ 10వ స్నాతకోత్సవ వేడుకలు

హైదరాబాద్: ఉన్నత విద్యలో ఆవిష్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోన్న లాభాపేక్ష లేని నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు) తమ 10వ స్నాతకోత్సవాన్ని వర్ట్యువల్‌ రియాల్టీ (వీఆర్‌) విధానంలో నిర్వహించింది. కోవిడ్‌-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల భద్రత దృష్ట్యా వీఆర్‌ విధానంలో నిర్వహించిన వేడుకలకు ప్రస్తుత విద్యార్థులతో పాటుగా పరిశ్రమ అగ్రగాములు. సుప్రసిద్ధ అతిథులు మరియు ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.
 
ఈ కార్యక్రమంలో ప్రతి గ్రాడ్యుయేట్‌ తమ వ్యక్తిగతీకరించిన రూపంలో డిగ్రీ సర్టిఫికెట్లను నిట్‌ యూనివర్శిటీ అధ్యక్షులు (వైస్‌ ఛాన్సెలర్‌) ప్రభు అగర్వాల్‌ నుంచి అందుకున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ మరియు కో-ఫౌండర్‌ శ్రీ నందన్‌ నీలేకని నుంచి పతకాలను అందుకున్నారు.
 
అనంతరం నీలేకని విద్యార్థులనుద్దేశించి తన ఉపన్యాసం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌ విశ్వవిద్యాలయాలకు నిట్‌ యూనివర్శిటీ ప్రాతినిథ్యం వహిస్తుందన్నారు. భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఇనిస్టిట్యూట్‌లలో ఒకటిగా ఎన్‌యు నిలుస్తుందన్నారు. ప్రపంచం సంక్షోభంలో ఉన్నవేళ  గ్రాడ్యుయేటింగ్‌ విద్యార్థులు బయటకు వస్తున్నారన్న ఆయన ఎన్‌యు వద్ద వారందున్న విద్యతో భవిష్యత్‌కు వారు పూర్తిగా సిద్ధమయ్యారని నమ్ముతున్నట్లు వెల్లడించారు.
 
ఈ సందర్భంగా శ్రీ రాజేంద్ర ఎస్‌ పవార్‌, ఫౌండర్‌, ఎన్‌యు అండ్‌ ఛైర్మన్‌, నిట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ విద్యార్థులనందరినీ అభినందించారు. రాబోయే సంవత్సరాలలో వారంతా విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిట్‌ వద్ద వారు అందుకున్న పరిశ్రమ సంబంధిత మరియు పరిశోధనాధారిత ఉన్నత విద్య వారి జీవితాలకు మార్గనిర్ధేశనం చేస్తుందన్నారు.
 
డాక్టర్‌ ప్రభు అగర్వాల్‌, అధ్యక్షులు (వైస్‌ ఛాన్స్‌లర్‌), నిట్‌ యూనివర్శిటీ మాట్లాడుతూ, వాస్తవ ప్రపంచంలోకి విజయవంతంగా తమ తొలి అడుగు వేస్తోన్న విద్యార్థులందరూ తమ జీవితాలలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరో మారు ఎన్‌యు విద్యార్థులందరూ 100% ప్లేస్‌మెంట్‌ పొందడం తమకు ఆనందం కలిగిస్తుందన్నారు.