మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (20:23 IST)

అలాంటి వారికి వద్దకే కరోనా బూస్టర్ డోస్ : జీహెచ్ఎంసీ వెల్లడి

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా రెండు డోసుల టీకాలు వేయించుకున్న వారికి బూస్టర్ డోస్‌లు వేస్తున్నారు. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 60 యేళ్లు పైబడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దకే కరోనా బూస్టర్ టీకాలను వేయాలని నిర్ణయించింది. 
 
ఇలాంటి వారు వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి వరుస క్రమంలో నిలబడి టీకాలు వేసుకోవడం చాలా కష్టతరంగా మారింది. దీంతో కరోనా టీకాలతో పాటు బూస్టర్ డోస్‌లను 60 యేళ్ళు పైబడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దకే టీకాలు వేయాలని నిర్ణయించింది. 
 
దీర్ఘలాకి ఇబ్బందులు పడుతున్న వారు 040-21 11 11 11 అనే నంబరుకు ఫోన్ చేసి వివరాలు చెబితే చాలని, ఆరోగ్య కార్యకర్తలు ఇంటి వద్దకే వెళ్లి టీకాలు వేస్తారని చెప్పారు. జీహెచ్ఎంసీ తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.