శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (12:32 IST)

పెయింటర్ దారుణ హత్య: కత్తితో దాడి చేసి..?

హైదరాబాదు నగరంలోని జగద్గిరిగుట్టలో ఓ పెయింటర్ దారుణ హత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్ట పరిధిలోని సంజయ్‌గాంధీ నగర్‌లో శుక్రవారం రాత్రి సురేశ్‌ అనే పెయింటర్ పై  రోషన్‌, రోహిత్‌ అనే వ్యక్తులు కత్తితో దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ శనివారం ఉదయం చనిపోయాడు. సురేశ్ దేవమ్మ బస్తీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి , పరారీలో ఉన్న నిందితులు రోషన్‌, రోహిత్‌ల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.