గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (16:21 IST)

వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

ktramarao
వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.900 కోట్ల విలువైన పనులకు కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. హనుమకొండలో ఐటి టవర్స్, మడికొండలో ఐటి పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 
 
కెటిఆర్ పర్యటన దృష్ట్యా ట్రై సిటీలో పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిపి రంగనాథ్ తెలిపారు. భారీ వాహనాలను సిటీకి బయటే ఆపేశారు. ఈ ఆంక్షలు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు.