గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (18:15 IST)

మహిళను ఓ పూజారి హత్య.. వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోమనే సరికి..?

priest - woman
మహిళను ఓ పూజారి హత్య చేసిన ఘటన షాక్‌కు గురిచేసింది. శంషాబాద్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్సర అనే మహిళతో పూజారి అయిన అయ్యగారి సాయి కృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 
 
అప్సర తనను పెళ్లి చేసుకోవాలంటూ అతనిపై ఒత్తిడి తెచ్చింది. కానీ అప్పటికే సాయి కృష్ణకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. దీంతో ఎలాగైనా అప్సరను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు.
 
ఇక ఒక పూజారి అయి ఉండి మహిళను హత్య చేసి తీరు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్సరను సరోయూర్ నగర్ నుంచి కారులో ఎక్కించుకొని వచ్చి శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోది హత్య చేశాడు. 
 
అనంతరం ఆమె మృతదేహాన్ని కవర్‌లో కట్టి.. కారులో తీసుకెళ్లి సరూర్‌నగర్‌లోనే మ్యాన్ హోల్‌లో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.