ది కేరళ స్టోరీ చూపెట్టినా నో యూజ్.. ముస్లిం యువకుడితో పరార్
బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌కు ఓ ముస్లిం యువతి చుక్కలు చూపించింది. ముస్లిం యువకుడితో ప్రేమలో పడ్డ ఓ యువతి మనసు మార్చేందుకు చేసిన ప్రయత్నంతో ఎంపీ ఖంగుతింది. ది కేరళ స్టోరీ సినిమాను యువతికి చూపించారు బీజేపీ ఎంపీ.
ఆ తర్వాత అనూహ్యంగా ఆ యువతి ముస్లిం యువకుడితో పరారైంది. వివరాల్లోకి వెళితే.. భోపాల్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిని (19) యూసుఫ్ అనే రౌడీ షీటర్ ముస్లిం అబ్బాయి ప్రేమలో పడింది. ప్పటికే అతడిపై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు యువతి వివాహం మరో వ్యక్తితో నిశ్చయమైంది.
మే 30న ముహూర్తం ఖరారైంది. ఇలాంటి పరిస్థితుల్లో యువతి మనసు మార్చేందుకు ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ రంగంలోకి దిగి.. ఆ యువతితో ది కేరళ స్టోరీ చూపెట్టింది. అయితే ఆ యువతి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
ఆ ముస్లిం యువకుడితోనే ఆ యువతి పారిపోయింది. వెళుతూ వెళుతూ ఇంట్లో తన పెళ్లి కోసం దాచిన నగలను కూడా వెంట తీసుకెళ్లిపోయింది. దీంతో, యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన ఇష్ట ప్రకారమే అతడితో వెళ్లిపోయానని సదరు యువతి వెల్లడించింది.