ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మే 2022 (09:21 IST)

ఘట్‌కేసర్‌లో రెడ్డి సింహగర్జన : మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

తెలంగాణ రాష్ట్రంలోని ఘట్‌కేసర్‌లో రెడ్డి గర్జన పేరుతో సింహగర్జన సభ జరిగింది. ఇందులో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అయితే, ఆయన ప్రసంగంలో తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఆగ్రహించిన సభికులు మంత్రి మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
 
అయితే, మంత్రి కాన్వాయ్‌పై కుర్చీలు, చెప్పులు, మంచినీటి బాటిళ్లు, ఇతర సామాగ్రిని విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. భద్రతగా ఉన్న పోలీసులు మంత్రిని సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితంగా పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కాగా, నిరసనకారులు రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో నినాదాలు చేశారు.