శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (15:53 IST)

తీవ్ర అస్వస్థతకు లోనైన ఆర్.కృష్ణయ్య

తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ ధర్నాలో పాల్గొన్న ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణా రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న గెస్ట్ టీచర్లకు మద్దతు తెలుపుతూ హైదరాబాదులోని బషీర్ బాగ్‌లో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం వద్ద బీసీ సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది.
 
ఈ ధర్నాలో ఆర్.కృష్ణయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.