శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (13:08 IST)

తెలంగాణలో అకాల వర్షాలు.. మరో మూడు రోజులు వానలు తప్పవ్

తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణను అకాల వర్షాలు కురిసే అవకాశం వుంది. 
 
ఇందులో భాగంగా తెలంగాణలో మూడు రోజులు రాష్ట్రంలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందన్నారు. దాని ప్రభావంతో చిరజల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
 
అకాల వర్షం తెలంగాణాలోని పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగండ్ల వానకు ధాన్యం తడిసిముద్దైంది.
 
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో కల్లాల్లో ఆరబోసిన పంట..వర్షానికి పూర్తిగా తడిసిపోయి…రైతుల కంట కన్నీరు తెప్పించింది.