గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (20:08 IST)

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్ నాథ్ సింగ్ (video)

Rajnath Singh
Rajnath Singh
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం నటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. అనారోగ్య సమస్య కారణంగా కృష్ణంరాజు ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్‌, సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డిలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, సినీ హీరో ప్రభాస్‌‌ను రాజ్ నాథ్ పరామర్శించారు.
 
ఈ సందర్భంగా కృష్ణంరాజు మృతిపట్ల తన సానుభూతిని వ్యక్తం చేశారు. కృష్ణంరాజు అనారోగ్యం, ఏయే చికిత్సలు అందించారు, ఇతర వివరాలను బీజేపీ నేతలు ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌కు వివరించారు.